Home  »  TV News  »  భవానిని ఇంప్రెస్ చేసిన కృష్ణ.. గీతికకి గోపి లవ్ ప్రపోజల్!

Updated : Jul 19, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -212 లో.. భవాని గెటప్ తో కృష్ణ తన వెనకాలే డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. భవానిని ఇమిటేట్ చేస్తున్న కృష్ణని చూసి.. ఈ రోజు పెద్ద యుద్ధమే అవుతుందని అందరు టెన్షన్ పడుతుంటారు.

ఆ తర్వాత ఏంటి మురారి యూనిఫామ్ ఎప్పుడు వేసుకోవడం లేదు. ఎప్పుడు ఈ తింగరి పిల్ల వెనకాల తిరుగుతున్నావని మురారిని కృష్ణ అంటుంది. చాలు కృష్ణ ఆపేయ్ అని మురారి అంటాడు. ఏంటి ప్రసాద్ నేను లేనప్పుడు తాగడమే పనిగా పెట్టుకున్నావట.. తాగడం వేడుకలా అప్పుడప్పుడు చెయ్యాలి.. అదేదో ఉద్యమంలాగా చెయ్యకూడదని ప్రసాద్ తో కృష్ణ అంటుంది. ఏంటి ఈ తింగరి పిల్ల నన్ను అనుకరిస్తుందా? నేను లేనప్పుడు చేసిన పనుల గురించి చెప్తుందా అని భవాని తనలో తానే అనుకుంటుంది. ఏ మధు రీల్స్ అంటూ నీ పెళ్ళాం చేతిలో దెబ్బలు పడడం ఎందుకు.. స్క్రిప్ట్ రాయి మనమే ఓన్ గా ప్రొడక్షన్ పెడదామని మధుతో కృష్ణ అంటుంది.

ఆ తర్వాత నువ్వేంటి సుమలత సన్నగా తయారు అవుతున్నావ్.. డైట్ చేస్తున్నావా? అదేదో మెడిటెషన్ కూడా చెయ్ మెంటల్ గా ఫిట్ గా ఉంటావని సుమలతతో కృష్ణ అంటుంది. నువ్వేంటి రేవతి ఇంట్లో పని మొత్తం చేస్తున్నావ్.. ముగ్గురు కోడళ్ళు ఉన్నారు కదా.. వాళ్లకి చెప్పొచ్చు కదా అని రేవతితో అంటుంది కృష్ణ. అలాగే అక్క అని రేవతి వెటకారంగా అంటుంది. ముకుంద నువ్వేంటి ఎప్పుడు గదిలోనే ఉంటావ్.. బయటకు వచ్చి అందరితో ఫ్రీగా ఉండని ముకుందతో కృష్ణ అంటుంది. చాల్లే కృష్ణ అత్తయ్య గారిలాగే బాగా చేసావ్ అని ముకుంద అంటుంది. కృష్ణ చేసే దానికి భవానికి నవ్వు వస్తుంది. కానీ బయటకు కనిపిస్తే నా పెద్దరికం ఏం ఉంటుంది అని సైలెంట్ గా కృష్ణ మాటలన్నీ వింటుంది. ఏంటి కృష్ణ మాటలకి భవాని అత్తయ్య ఇంప్రెస్ అయిందా అని ముకుంద తనలో తానే అనుకుంటుంది.  అత్తయ్య ఇది మిమ్మల్ని అనుకరించడం కాదు.. అనుసరించడమని భవానితో కృష్ణ అంటుంది.. నువ్వు ఎంత చేసిన అక్కని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు. వచ్చి టిఫిన్ చేయమని కృష్ణతో రేవతి అంటుంది. వెళ్ళు వెళ్లి టిఫిన్ చెయ్ అని కృష్ణని భవాని అనగానే.. కృష్ణ సంతోషపడుతుంది.

మరొక వైపు గీతికకి గోపి ప్రపోజ్ చేస్తాడు. నీకు ఇష్టం అయితే రేపు ఇదే టైమ్ కి చెప్పమని గోపి అంటాడు. నాకు ఇష్టమే రేపు ఇదే విషయం చెప్తాను. అలాగే మురారి ముకుందలని మనం ఒకటి చెయ్యొచ్చని గీతిక అనుకుంటుంది. కృష్ణ మురారి ఇద్దరిని ఒకటి చెయ్యాలని గోపి అనుకుంటాడు. మరొక వైపు కృష్ణ వాళ్ళ పెద్దమ్మని ఇంప్రెస్ చేసినందుకు కృష్ణని మురారి ఎత్తుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ మురారి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.